"where is Pushpa " పుష్ప ఎక్కడ ? - అల్లు అర్జున్ - టీజర్

 అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప - 2 సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర నిర్మాతలు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా "where is Pushpa ", "పుష్ప ఎక్కడ", అంటూ  ఏప్రిల్ 7న  విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ని బట్టి ఇందులో పుష్ప తిరుపతి జైలు నుంచి బులెట్ గాయాలతో  తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తుంది. పారిపోయే ప్రయత్నంలో పోలీసులు  జరిపిన కాల్పులలో మరణించాడు అని అందరు భావిస్తారు.  ఈ వార్త తెలిసిన  పుష్ప అభిమానులు తిరుపతి, చిత్తూరు అల్లర్లు జరిగినట్లు చూపించారు. 

అలాగే పుష్ప గురించి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత అభిమానం చుపిస్తున్నారో  అతనంటే ఎంతగా అల్లాడుతున్నారో తెలిసే విధంగా టీ స్టాల్ యజమాని చెప్పే మాటల ద్వారా తెలియచేసారు దర్శకుడు.   

చివరగా టీవీ రెపోర్టర్ తెచ్చిన వీడియో ఫుట్ఠేజి ద్వారా పుష్ప బ్రతికి ఉన్నాడని తెలుస్తుంది. ఈ వీడియో లో " అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులొచ్చిందని అర్ధం. అదే పులే రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం " అనే డైలాగ్ హైలైట్ .

డైరెక్టర్ సుకుమార్ తాను ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని ఈ ట్రైలర్ లో పూర్తిగా బలంగా చూపించాడు 

Movie Name     : Pushpa: The Rule
Cast                  : Allu Arjun, Rashmika Mandanna,
                           Fahadh Faasil
Music                : Devi Sri Prasad
Direction           : Sukumar B
Producers         : Naveen Yerneni,

                            Ravi Shankar Yalamanchili

watch Pushpa - 2 Teaser


No comments

Powered by Blogger.